Love Jihad: హిందూ మహిళను ఇస్లాంలోకి మార్చి.. ఇతరులతో శారీరక సంబంధాలు పెట్టుకోవాలని వేధింపులు.. నిరాకరించడంతో ఐరన్‌పైపుతో దారుణంగా దాడి.. వీడియో ఇదిగో!

Feroz converts Hindu woman to Islam before marrying and forces her to keep physical relations with others
  • గుజరాత్‌లోని భుజ్‌లో ఘటన
  • బాధితురాలు జానకిని ట్రాప్ చేసిన ముస్లిం యువకుడు
  • డ్రగ్ వ్యాపారంలోకి దింపే ప్రయత్నం
  • నిందితుడు ఫిరోజ్ దాడిలో కమిలిపోయిన బాధితురాలి శరీరం
  • ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలు

లవ్ జిహాద్ గుజరాత్‌లో మరోమారు కలకలం రేపింది. పెళ్లి చేసుకోవడానికి ముందు హిందూ యువతిని ఇస్లాంలోకి మార్చిన యువకుడు ఆ తర్వాత ఇతరులతోనూ శారీరక సంబంధం పెట్టుకోవాలని బలవంతం చేశాడు. అందుకామె నిరాకరించడంతో ఇనుప పైపుతో ఆమెను చావబాదాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.

భుజ్ నగరానికి చెందిన ఫిరోజ్ అనే యువకుడు జానకి అనే అమ్మాయిని ప్రేమ పేరుతో ముగ్గులోకి దించాడు. ఆ తర్వాత ఆమెను బలవంతంగా ఇస్లాంలోకి మార్చి వివాహం చేసుకున్నాడు. పెళ్లి తర్వాత ఆమెకు నరకం చూపించాడు. ఇతరులతో శారీరక సంబంధాలు పెట్టుకోవాలని బలవంతం చేశాడు. అందుకు ఆమె నిరాకరించడంతో నరకం చూపించాడు. ఐరన్ పైపుతో ఆమెపై విచక్షణ రహితంగా దాడిచేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అయ్యాయి. బయటకొచ్చిన ఆ వీడియోలు నిజమేనని బాధితురాలు మీడియాకు తెలిపింది. 

‘జీ న్యూస్’ కథనం ప్రకారం.. జానకిని డ్రగ్ వ్యాపారంలోకి దింపాలని ఫిరోజ్ ప్రయత్నించాడు. దీనికి ఆమె నిరాకరించినప్పుడల్లా ఆమెను ఇష్టం వచ్చినట్టు కొట్టేవాడు. అతడి ఉచ్చులో తాను చిక్కుకున్నానని, ఇలాంటి మతోన్మాదుల ఉచ్చులో మరెవరూ పడకూడదని తాను కోరుకుంటున్నట్టు ఆమె పేర్కొంది. ఫిరోజ్ చేతికి చిక్కి నాలుగేళ్లుగా నరకం అనుభవిస్తున్న బాధితురాలు తాజాగా స్థానిక ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతోంది. ఫిరోజ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తోంది. 

వైరల్ అవుతున్న వీడియోలో బాధితురాలి శరీరం కమిలిపోయి ఉంది. వీపు మొత్తం దెబ్బలతో ఎర్రగా మారింది. కొన్నిచోట్ల శరీరం తెగిపడింది. వీడియో వెలుగులోకి వచ్చాక తీవ్ర ఆందోళన వ్యక్తమైంది. నెటిజన్ల తీవ్రస్థాయిలో స్పందిస్తున్నారు. నిందితుడిని ఇలాగే వదిలేస్తే చాలా ప్రమాదకరమని, అతడిపై చర్యలు తీసుకోవాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు.

  • Loading...

More Telugu News