Kotamreddy Sridhar Reddy: అక్టోబర్ 24 నుంచి ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి పాదయాత్ర

Kotamreddy sridhar reddy to embark on padayatra
షార్ట్స్‌లో చూడండి
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి త్వరలో పాదయాత్ర నిర్వహించనున్నారు. ప్రస్తుతం చంద్రబాబుకు మద్దతుగా నిర్వహిస్తున్న సంఘీభావ సదస్సుల అనంతరం ఈ యాత్ర చేపట్టబోతున్నట్టు ఆయన ‘ఎక్స్’ వేదికగా వెల్లడించారు. అక్టోబర్ 24 నుంచి ఈ పాదయాత్ర ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. 33 రోజుల పాటు సాగనున్న ఈ పాదయాత్రలో ఆయన లక్షమందితో మాటామంతీ నిర్వహిస్తారు. ప్రజలతో మమేకమై స్థానిక పరిస్థితులు, సమస్యలు కూలంకషంగా తెలుసుకునే లక్ష్యంతో ఈ యాత్ర చేపడుతున్నట్టు వెల్లడించారు.
Go Back to Shorts
Kotamreddy Sridhar Reddy
Nellore District

More Telugu News