దర్శకుడు దేవ కట్టా కామెంట్స్‌ను రీట్వీట్ చేసిన నారా లోకేశ్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

దర్శకుడు దేవ కట్టా కామెంట్స్‌ను రీట్వీట్ చేసిన నారా లోకేశ్

Nara Lokesh retweeted Deva Katta comments
  • ఏపీలో పాలనపై పరోక్షంగా విమర్శలు గుప్పించిన లోకేశ్
  • ప్రజాస్వామ్యంలో నేరం రుజువయ్యే వరకు మీరు దోషి కాదు...
  • నియంతృత్వంలో నిర్దోషి అని నిరూపించబడే వరకు మీరు దోషులే అనే వ్యాఖ్యలను రీట్వీట్ చేసిన లోకేశ్
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆంధ్రప్రదేశ్‌లో పాలనపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. ప్రముఖ దర్శకుడు, రచయిత దేవ కట్టా చేసిన ఓ ట్వీట్‌ను రీట్వీట్ చేశారు. ప్రజాస్వామ్యంలో నేరం రుజువయ్యేవరకు దోషి కాదని, కానీ నియంతృత్వంలో మాత్రం నిర్దోషి అని నిరూపించబడే వరకు మీరు దోషి అని దేవ కట్టా చేసిన ట్వీట్‌ను రీట్వీట్ చేశారు.
'ప్రజాస్వామ్యం: నేరం రుజువయ్యే వరకు మీరు దోషి కాదు!!
నియంతృత్వం: నిర్దోషి అని నిరూపించబడే వరకు మీరు దోషులే!!'
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబును సీఐడీ గత నెల 9న అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. నెల రోజులకు పైగా ఆయన రాజమండ్రి కేంద్రకారాగారంలో ఉంటున్నారు. 
Advertisement
Nara Lokesh
deva katta
Telugudesam

More Telugu News