వరల్డ్ కప్ చరిత్రలోనే ఫాస్టెస్ట్ సెంచరీ... రికార్డు బద్దలు కొట్టిన మార్ క్రమ్
- వరల్డ్ కప్ లో ఇవాళ దక్షిణాఫ్రికా వర్సెస్ శ్రీలంక
- 49 బంతుల్లో 100 పరుగులు చేసిన మార్ క్రమ్
- కెవిన్ ఓ బ్రయాన్ రికార్డు తెరమరుగు
గతంలో ఈ రికార్డు ఐర్లాండ్ ఆటగాడు కెవిన్ ఓ బ్రయాన్ పేరిట ఉంది. కెవిన్ ఓ బ్రయాన్ 2011 వరల్డ్ కప్ లో బెంగళూరులో ఇంగ్లాండ్ తో మ్యాచ్ సందర్భంగా 50 బంతుల్లో శతకం అందుకున్నాడు. ఇప్పటివరకు వరల్డ్ కప్ లో ఇదే రికార్డు. ఇవాళ మార్ క్రమ్ ఆ రికార్డు తిరగరాశాడు.
కాగా, వన్డేల్లో అత్యంత వేగవంతమైన సెంచరీ మాత్రం దక్షిణాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్ పేరిట ఉంది. డివిలియర్స్ కేవలం 31 బంతుల్లోనే 100 పరుగులు సాధించి చరిత్ర సృష్టించాడు.