విజయ్ ను లోకేశ్ కనగరాజ్ మామూలుగా చూపించలేదే .. 'లియో' ట్రైలర్ రిలీజ్!
- లోకేశ్ కనగరాజ్ రూపొందించిన 'లియో'
- డిఫరెంట్ లుక్ తో కనిపించనున్న విజయ్
- ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్న భారీ తారాగణం
- హైలైట్ అనిపించనున్న అనిరుధ్ సంగీతం
- పాన్ ఇండియా స్థాయిలో ఈ నెల 19న విడుదల
సెవెన్ స్క్రీన్ స్టూడియో బ్యానర్ పై ఈ సినిమాను లలిత్ కుమార్ నిర్మించాడు. ఈ నెల 19వ తేదీన పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో కొంతసేపటి క్రితం ఈ సినిమా నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ప్రధానమైన పాత్రలను కవర్ చేస్తూ కట్ చేసిన ఈ ట్రైలర్ ఆకట్టుకుంటోంది. యాక్షన్ .. ఎమోషన్స్ తో కూడిన సీన్స్ ఈ సినిమా భారీతననానికి అద్దం పడుతున్నాయి. అనిరుధ్ సంగీతం ఈ సినిమాకి అదనపు బలంగా నిలుస్తుందని అంటున్నారు. అలాగే భారీ తారాగణం కూడా ఈ సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణగా నిలుస్తుందని చెబుతున్నారు. త్రిష కథానాయికగా నటించిన ఈ సినిమాలో సంజయ్ దత్ .. అర్జున్ .. గౌతమ్ మీనన్ .. మన్సూర్ అలీఖాన్ .. ప్రియా ఆనంద్ కనిపించనున్నారు.