బెయిల్, కస్టడీ పిటిషన్: చంద్రబాబు తరఫున వాదనలు వినిపించిన సుప్రీంకోర్టు న్యాయవాది
- స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు ఎలాంటి తప్పిదాలు చేయలేదన్న న్యాయవాది
- నాటి ఆర్థిక శాఖ ఉన్నతాధికారి గుజరాత్ వెళ్లి ఈ స్కీమ్‌పై అధ్యయనం చేశారని వెల్లడి
- సీమెన్స్ ప్రాజెక్టుపై ఎలాంటి అభ్యంతరాలు తెలపలేదన్న చంద్రబాబు న్యాయవాది
- నోటీసులు ఇవ్వకుండానే అరెస్ట్ చేశారని, కస్టడీలోకి తీసుకున్నారని వెల్లడి
- కేబినెట్ నిర్ణయం తీసుకుంటే చంద్రబాబుపై కేసు ఎలా పెడతారని ప్రశ్న
ఈ కమిటీలో ఉన్న భాస్కరరావు ప్రస్తుతం మధ్యంతర బెయిల్ పైన ఉన్నారని, ఈ బెయిల్‌ను సుప్రీంకోర్టు నవంబర్ 16 వరకు పొడిగించిందన్నారు. చంద్రబాబుకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే అరెస్ట్ చేశారని, ఆ తర్వాత విచారణ చేపట్టారన్నారు. సీఐడీ రెండు రోజులు ఆయనను కస్టడీకి తీసుకొని కూడా విచారించిందన్నారు. ఇప్పుడు మరోసారి కస్టడీ కోరుతున్నారని, అసలు ఆ అవసరం ఏముంది? అన్నారు. కేబినెట్ ఆమోదం తర్వాతే సీమెన్స్ ప్రాజెక్టు అమల్లోకి వచ్చిందని, కేబినెట్ నిర్ణయం తీసుకుంటే చంద్రబాబుపై కేసు ఎలా పెడతారని దుబే వాదనలు వినిపించారు. ఆ తర్వాత విచారణ మధ్యాహ్నానికి వాయిదా పడింది.