మోత మోగిద్దాం అంటూ టీడీపీ ఇచ్చిన పిలుపుపై అంబటి రాంబాబు ఎద్దేవా!

మోత మోగిద్దాం అంటూ టీడీపీ ఇచ్చిన పిలుపుపై అంబటి రాంబాబు ఎద్దేవా!

Ambati Rambabu reacts on TDP call Motha Mogiddam
  • స్కిల్ కేసులో జ్యుడీషియల్ రిమాండులో చంద్రబాబు 
  • చంద్రబాబుకు మద్దతుగా మోత మోగిద్దాం అంటూ టీడీపీ పిలుపు
  • విధి విచిత్రమైనదన్న అంబటి రాంబాబు
  • గతంలో కాపు ఉద్యమంలో పళ్లాలు కొట్టినవారిని బొక్కలో వేశారని వెల్లడి
  • ఇప్పుడు అవినీతి కేసులో బొక్కలో పడి పళ్లాలు కొట్టమంటున్నావ్ అంటూ వ్యాఖ్యలు
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అరెస్టయిన చంద్రబాబుకు మద్దతుగా రేపు రాత్రి 7 గంటల నుంచి ఐదు నిమిషాల పాటు 'మోత మోగిద్దాం' కార్యాచరణకు టీడీపీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. అందుబాటులో ఏది ఉంటే అది మోగించాలని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. దీనిపై మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. 

"విధి విచిత్రమైనది! నాడు కాపు ఉద్యమంలో పళ్లాలు కొట్టినవారిని మక్కెలు విరగ్గొట్టి బొక్కలో వేశావ్! ఇప్పుడు అవినీతిలో కేసులో బొక్కలో పడి పళ్లాలు కొట్టమంటున్నావ్.. వారేవా!" అంటూ ఎక్స్ లో పోస్టు చేశారు.
Advertisement
Ambati Rambabu
Motha Mogiddam
Chandrababu
YSRCP
TDP

More Telugu News