సుప్రీంలో చంద్రబాబు పిటిషన్: 'నాట్ బిఫోర్ మీ' అన్న జస్టిస్ ఎస్వీఎన్ భట్టి.. విచారణ వాయిదా
- విచారణకు మొగ్గుచూపని జస్టిస్ భట్టి
- కేసును అర్జంట్‌గా విచారించాలన్న చంద్రబాబు న్యాయవాదులు
- సీజేఐ వద్ద ప్రస్తావించేందుకు చంద్రబాబు తరఫు న్యాయవాదుల ప్రయత్నం
విచారణ చేపట్టేందుకు జస్టిస్ ఖన్నా నేతృత్వంలోని ద్విసభ్య బెంచ్ విముఖత చూపడంతో చంద్రబాబు తరఫు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా సీజేఐ వద్ద ప్రస్తావించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అర్జంట్‌గా కేసును విచారించాలని చంద్రబాబు లాయర్లు కోరినప్పటికీ ద్విసభ్య బెంచ్ మొగ్గు చూపలేదు. రేపు, ఎల్లుండి కోర్టుకు సెలవుల నేపథ్యంలో ఈ పిటిషన్ పై విచారణ వచ్చే వారం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.