‘మహా’ రాజకీయాల్లో మరో కుదుపు.. మంత్రి పదవి రేపు ఉంటుందో, ఊడుతుందోనన్న అజిత్ పవార్
- ముంబైలో అమిత్ షా కార్యక్రమానికి అజిత్ పవార్ గైర్హాజరు
- ముందస్తు కార్యక్రమాల వల్లేనన్న పవార్
- ముసలం తప్పదంటున్న రాజకీయ నిపుణులు
ముంబైలో అమిత్ షా కార్యక్రమానికి హాజరు కాకపోవడంపై మాట్లాడుతూ.. ముందస్తు కార్యక్రమాల వల్ల తాను హాజరుకాలేకపోతున్నట్టు షా కార్యాలయానికి సమాచారం అందించినట్టు తెలిపారు. గణేశుడి దర్శనం కోసం ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఇళ్లను అమిత్ షా సందర్శించారు. కాగా, అజిత్ పవార్ వ్యాఖ్యలు రాజకీయాల్లో చర్చనీయాంశమయ్యాయి. కూటమి నుంచి బయటకు వచ్చే అవకాశాలున్నాయని రాజకీయ పండితులు అంచనా వేస్తున్నారు. అదే జరిగితే ‘మహా’ రాజకీయాల్లో మరో కుదుపు తప్పదన్నట్టే.