లియో హిందీ వెర్షన్ విడుదలకు ఇక్కట్లు
- లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహించిన సినిమాపై భారీ అంచనాలు
- నాలుగు వారాల తర్వాత నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవ్వనున్న విజయ్ సినిమా
- మల్టీప్లెక్సుల్లో హిందీ సినిమా విడుదలవ్వాలంటే 8 వారాల విరామం ఉండాలన్న ఒప్పందంతో సమస్య
పీవీఆర్, ఐనాక్స్, సినిపాలిస్ వంటి నేషనల్ మల్టీప్లెక్స్ చైన్స్ లో ఏ భారతీయ సినిమా హిందీ వెర్షన్ విడుదల కావాలన్నా.. కనీసం 8 వారాల గ్యాప్ తర్వాత గానీ ఓటీటీలో ప్రదర్శించకూడదన్న ఒప్పందం ఉంది. అయితే, నెట్ ఫ్లిక్స్ తో ఒప్పందం కుదుర్చుకున్న లియో థియేటర్లలో విడుదలైన నాలుగు వారాలకే ఓటీటీలో స్ట్రీమ్ అవనుంది. ఇదే లియో హిందీ వెర్షన్ రిలీజ్ కు అడ్డంకిగా మారింది. ప్రస్తుతానికి పీవీఆర్, ఐనాక్స్, సినీపాలిస్ లో హిందీ వెర్షన్ విడుదల సాధ్యం కాదని తెలుస్తోంది. ఈ సమస్య పరిష్కారానికి చర్చలు జరుగుతున్నాయి.