అతని వల్లే జైలర్ సూపర్ హిట్ అయింది: రజనీకాంత్
- అనిరుధ్ సంగీతం అద్భుతంగా ఉందన్న సూపర్ స్టార్
- నేపథ్య సంగీతంతో సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాడని కితాబు
- రూ. 600 కోట్లు వసూలు చేసిన జైలర్
ఈ విషయం ఒక్క తమిళ సినిమాలకే కాకుండా భారతదేశ చిత్ర పరిశ్రమకే గర్వకారణం అవుతుందన్నారు. ఇక, జైలర్ సినిమా ఎబోవ్ యావరేజ్ అవుతుందని తాను అనుకున్నానని రజనీ చెప్పారు. కానీ అనిరుధ్ రవిచందర్ అందించిన నేపధ్య సంగీతంతో ఇలా పెద్ద హిట్ అయిందన్నారు. రవిచందర్ తన సంగీతంతో ఈ సినిమాని ఎక్కడికో తీసుకెళ్లాడని, తన స్నేహితుడు, దర్శకుడు నెల్సన్ కి హిట్ ఇవ్వాలని నేపధ్య సంగీతం బాగా అందించాడని అభిప్రాయపడ్డారు. ఇక, ఈ సినిమాలో మోహన్ లాల్, శివరాజ్ కుమార్ పాత్రలను దర్శకుడు చూపించిన తీరు చాలా బాగుందని కూడా ప్రశంసించారు. ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అయ్యాక, తన తర్వాతి సినిమా ఇంతకన్నా పెద్దగా ఎలా ఇవ్వాలనే టెన్షన్ మొదలైందని రజనీకాంత్ చెప్పారు.