జానపద గాయకురాలు ఊర్వశిపై కరెన్సీ నోట్ల వర్షం... వీడియో ఇదిగో!
- కచ్‌లో గోశాల పనుల కోసం నిధుల సేకరణలో భాగంగా సంగీత కచేరీ
- ఊర్వశి రాధాదియా గాత్రానికి ముగ్ధులైన అభిమానులు
- ఆమె పాడుతున్నంతసేపు కరెన్సీని వెదజల్లిన అభిమానులు
కచ్‌లో గోశాల పనుల కోసం నిధుల సేకరణలో భాగంగా స్థానికంగా సంగీత కచేరీని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం గురువారం జరిగింది. ఆమె గాత్రానికి మంత్రముగ్ధులైన అభిమానులు అదేపనిగా కరెన్సీ నోట్లను వెదజల్లారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఆమె సోషల్ మీడియా వేదికగా షేర్ చేసి, అందరికీ ధన్యవాదాలు తెలిపారు.