లిబియాలో ఎటుచూసినా శవాల దిబ్బలే.. ఇప్పటికే 5,300 మందికిపైగా మృతి
- డెర్నాలో డేనియల్ తుపాను విధ్వంసం
- ఒక్క డెర్నా నగరంలోనే 5 వేల మందికిపైగా మృత్యువాత
- రోడ్లపైన, ఆసుపత్రి ప్రాంగణాల్లో కుప్పలుగా మృతదేహాలు
- కన్నీటిని అదుపు చేసుకుని తమ వారిని గుర్తిస్తున్న కుటుంబ సభ్యులు
దాదాపు 1.25 లక్షల కుటుంబాలు నివాసముండే డెర్నాలో ఇళ్లు పేకమేడల్లా కుప్పకూలాయి. కార్లు కాగితపు పడవల్లా తేలుతూ కొట్టుకుపోయాయి. వీధులు మునిగిపోయాయి. పెద్ద ఎత్తున బురద పేరుకుపోయింది. రోడ్లపైన, ఆసుపత్రి ప్రాంగణాల్లో శవాల దిబ్బలు కనిపిస్తున్నాయి. అక్కడికి చేరుకుంటున్న ప్రజలు కన్నీటితో తమ వారిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. టర్కీ సహా ఇతర దేశాలు సహాయ కార్యక్రమాల కోసం తమ బృందాలను లిబియా పంపాయి. ఐక్యరాజ్య సమితి కూడా ఇదే పనిలో ఉంది.