ఇంట్లోకి దూరిన కొండచిలువను ధైర్యంగా పట్టేసిన ఆస్ట్రేలియా క్రికెటర్.. వీడియో
- ఫ్లోర్ మాప్ కర్ర సాయంతో పట్టుకున్న వైనం
- మూడు కొండ చిలువలను బయటకు పంపించిన మాజీ క్రికెటర్
- ఇన్ స్టా గ్రామ్ లో ఇందుకు సంబంధించి వీడియో షేర్
తన ఇంట్లోకి కార్పెట్ పైథాన్ చొరబడినట్టు గుర్తించిన మెక్ గ్రాత్ దాన్ని ఇల్లును తుడిచే మాప్ కర్ర సాయంతో పట్టేశారు. మాప్ కర్రతో దాన్ని తలభాగం వద్ద అదిమి పట్టి తోక పట్టుకుని చిన్నగా ఇంటి బయటకు తీసుకెళ్లడాన్ని వీడియోలో చూడొచ్చు. దాన్ని సురక్షితంగా తీసుకెళ్లి చెట్లలో విడిచి పెట్టినట్టు మెక్ గ్రాత్ వెల్లడించారు. ఇంకా ఆశ్చర్యం ఏమిటంటే.. తన భార్య సారా లియాన్ మెక్ గ్రాత్ సహకారంతో ఇంట్లోకి ప్రవేశించిన మూడు కార్పెట్ కొండ చిలువలను పట్టుకుని బయటకు పంపించినట్టు మెక్ గ్రాత్ తెలిపారు. (వీడియో కోసం)