Anushka Shetty: ప్రభాస్ కు ఫుడ్ రెసిపీ చాలెంజ్ విసిరిన అనుష్క

Anushka nominates Prabhas for MSMP Recipe Challenge
  • అనుష్క, నవీన్ పోలిశెట్టి జంటగా మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి
  • సెప్టెంబరు 7న రిలీజ్
  • ఫుడ్ రెసిపీ చాలెంజ్ ప్రారంభించిన అనుష్క
  • ప్రభాస్ పేరును నామినేట్ చేసిన వైనం
అనుష్క, నవీన్ పోలిశెట్టి నటించిన మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. సెప్టెంబరు 7న ఈ ఎంటర్టయిన్ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చిత్రబృందం వినూత్న రీతిలో రెసిపీ చాలెంజ్ ప్రారంభించింది. 

ఈ చిత్రంలో అనుష్క ఓ చెఫ్ పాత్ర పోషించిన నేపథ్యంలో, సోషల్ మీడియాలో ఫుడ్ రెసిపీ చాలెంజ్ ను విస్తృతం చేయాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగా అనుష్క మంగళూరు చికెన్ కర్రీ, మంగళూరు నీర్ దోసె రెసిపీలను పంచుకున్నారు. అనంతరం ఈ చాలెంజ్ ను స్వీకరించాలంటూ హీరో ప్రభాస్ ను నామినేట్ చేశారు.

"మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి చిత్రంలో నేనొక చెఫ్ పాత్ర పోషిస్తున్నాను. నా పాత్ర ఎంతో సరదాగా ఉంటుంది. ఈ క్రమంలో నేను మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి రెసిపీ చాలెంజ్ ను ప్రారంభిస్తున్నాను. నా ఫేవరెట్ రెసిపీని మీతో పంచుకుంటున్నాను. ఇక, ఈ చాలెంజ్ ను స్వీకరించాల్సిందిగా ప్రభాస్ ను కోరుతున్నాను. 

ఎందుకంటే, ప్రభాస్ భోజన ప్రియుడని అందరికీ తెలిసిందే. పైగా, ఇతరులకు పసందైన వంటకాలను తినిపించడం కూడా ఆయనకు బాగా ఇష్టం. అందుకే ఈ రెసిపీ చాలెంజ్ కు ప్రభాస్ పేరును ట్యాగ్ చేస్తున్నాను. ప్రభాస్ తన ఫేవరెట్ రెసిపీని అందరితో పంచుకోవాలని కోరుతున్నాను. అందరూ ఈ చాలెంజ్ లో పాలుపంచుకోవచ్చు. మీ ఫేవరెట్ రెసిపీ ఏంటో నాతో పంచుకోండి... మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి చాలెంజ్ ను మరింత ముందుకు తీసుకెళ్లండి" అంటూ అనుష్క పిలుపునిచ్చారు.

More Telugu News

Anushka Shetty
Miss Shetty Mr Polishetty
MSMPRecipe Challenge
Prabhas
Tollywood