Amitabh Bachchan: భారత్ మాతాకీ జై అంటూ అమితాబ్ బచ్చన్ ట్వీట్!

Amitabh Bachchan Bharat Mata Post Divides Internet After G20 Invite Sparks Buzz
షార్ట్స్‌లో చూడండి
జీ-20 విందు కోసం రాష్ట్రపతి భవన్ పంపిన ఆహ్వాన పత్రికల్లో ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని ఉండటంపై వివాదం రాజుకుంది. ఈ క్రమంలో దేశం పేరును త్వరలో ఇండియా నుండి భారత్‌గా మార్చనున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. రాజ్యాంగాన్ని సవరించి ఈ మేరకు తీర్మానం చేయవచ్చునని అంటున్నారు. ఈ నేపథ్యంలో బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ చేసిన ట్వీట్ ఆసక్తికర చర్చకు దారి తీసింది.

కేంద్ర ప్రభుత్వం ఇండియా పేరును భారత్‌గా మార్చనుందనే ప్రచారం సాగుతోన్న సమయంలోనే అమితాబ్ 'భారత్ మాతాకీ జై' అని ట్వీట్ చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ మేరకు సోషల్ మీడియా అనుసంధాన వేదిక ఎక్స్ (ట్విట్టర్)లో పోస్ట్ చేశారు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చోట ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని ఉపయోగించడం ఇదే మొదటిసారి.
Go Back to Shorts
Amitabh Bachchan
bharat
BJP
President Of India

More Telugu News