Karthikeya: చాలా గ్యాప్ తరువాత వచ్చిన మంచి మెలోడీ .. 'వెన్నెల్లో ఆడపిల్లా ..'

Bedurulanka 2012 movie song released
షార్ట్స్‌లో చూడండి
ఒకప్పుడు సినిమాలో ఒక వెన్నెల పాటగానీ .. ఒక వాన పాట గాని తప్పనిసరిగా ఉండేవి. వానలో .. వెన్నెల్లో హీరో - హీరోయిన్ రొమాన్స్ ఆడియన్స్ నుంచి ఎక్కువ మార్కులు కొట్టేసేది. ఈ నేపథ్యంలో చిత్రీకరించిన మెలోడియస్ సాంగ్స్ కి మరింత ఆదరణ లభించేది. అయితే ఈ మధ్య కాలంలో ఈ తరహా పాటల జోరు తగ్గింది. 

అసలు సినిమాల్లో పాటల సంఖ్య కూడా తగ్గిపోతూ వస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో 'బెదురులంక 2012' సినిమాలోని 'వెన్నెల్లో ఆడపిల్లా' అంటూ సాగే ఒక పాట ఆడియన్స్ ను అలరిస్తోంది. సినిమాలోని పాటల్లో ఈ పాటనే మనసులను కొల్లగొడుతుంది. అలాంటి ఈ పాటను తాజాగా విడుదల చేశారు. 

'వెన్నెల్లో ఆడపిల్లా .. కవ్వించే కన్నెపిల్లా .. కోపంగా చూస్తే ఎల్లా  .. క్షణంలో అగ్గిపుల్లా' అంటూ ఈ పాట సాగుతోంది. కార్తికేయ - నేహా శెట్టిపై ఈ పాటను చిత్రీకరించారు. మెలోడీ బ్రహ్మగా పేరున్న మణిశర్మ ఈ పాటను స్వరపరిచారు. ఈ మధ్య కాలంలో యూత్ కి ఎక్కువ కనెక్ట్ అయిన పాటగా దీనిని గురించి చెప్పుకోవచ్చు.


Go Back to Shorts
Karthikeya
Neha Shetty
Bedurulanka 2012

More Telugu News