రజనీ 'జైలర్' చిత్రంపై ఐపీఎల్ టీమ్ అభ్యంతరం
- ఇటీవల విడుదలైన జైలర్
- రజనీకాంత్ కెరీర్ లో మరో బ్లాక్ బస్టర్
- ఓ సన్నివేశంలో ఆర్సీబీ జెర్సీతో కనిపించిన కాంట్రాక్ట్ కిల్లర్
- హీరో కోడలిపై అసభ్య వ్యాఖ్యలు... హైకోర్టును ఆశ్రయించిన ఆర్సీబీ
అయితే ఈ సినిమాపై ఐపీఎల్ ఫ్రాంచైజీ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ సినిమాలో ఓ పాత్రధారి ఆర్సీబీ జెర్సీ వేసుకుని హీరో కోడలిని ఉద్దేశించి అసభ్యకరంగా మాట్లాడతాడు. తమ జెర్సీ వేసుకున్న వ్యక్తితో అలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయించారంటూ ఆర్సీబీ యాజమాన్యం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ఆ సన్నివేశాన్ని తొలగించాలని కోరింది. ఈ పిటిషన్ ను విచారించిన న్యాయస్థానం... జైలర్ సినిమా నుంచి సదరు సన్నివేశాన్ని తొలగించాలని చిత్రబృందాన్ని ఆదేశించింది.