ప్రెషర్ కుక్కర్ తో బాది ప్రియురాలిని చంపేసిన యువకుడు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ప్రెషర్ కుక్కర్ తో బాది ప్రియురాలిని చంపేసిన యువకుడు

Man hits to death his girl friend with pressure cooker
  • బెంగళూరులో ఘటన
  • సహజీవనం చేస్తున్న వైష్ణవ్, దేవ
  • దేవ మరో యువకుడితో సన్నిహితంగా ఉంటోందని వైష్ణవ్ అనుమానం
  • ఇద్దరి మధ్య తరచుగా ఘర్షణ
  • శనివారం తీవ్ర రూపం దాల్చిన గొడవ... బెడ్రూంలో రక్తపుమడుగులో దేవ
బెంగళూరులో ఘాతుకం జరిగింది. ఓ వ్యక్తి తన ప్రియురాలిని దారుణంగా అంతమొందించాడు. కేరళకు చెందిన వైష్ణవ్, దేవ కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఉమ్మడి స్నేహితుల ద్వారా ఇరువురికి పరిచయం ఏర్పడి, అది ప్రేమగా మారింది. గత మూడేళ్లుగా వీరిద్దరూ కలిసే ఉంటున్నారు. 

గత 18 నెలలుగా బెంగళూరులో ఓ ఫ్లాట్ లో అద్దెకు ఉంటున్నారు. షేర్ మార్కెట్ ట్రేడింగ్, మార్కెటింగ్ కు సంబంధించిన విధులను ఇంటి వద్ద నుంచే నిర్వర్తిస్తుండేవారు. దేవ స్వస్థలం తిరువనంతపురం కాగా, వైష్ణవ్ స్వస్థలం కొల్లాం. అతడి తండ్రి ఆర్మీ అధికారి. 

కాగా, 24 ఏళ్ల దేవ మరొకరితో సంబంధం కలిగి ఉందేమోనని వైష్ణవ్ అనుమానించసాగాడు. ఈ విషయంలో ఇద్దరి మధ్య గొడవలు జరుగుతుండేవి. అయితే శనివారం ఇద్దరి మధ్య ఘర్షణ మరింత తీవ్రమైంది. దేవపై కోపంతో కిచెన్ లోకి వెళ్లి ప్రెషర్ కుక్కర్ తీసుకువచ్చిన వైష్ణవ్... అందులో అన్నం ఉండడంతో దాన్ని వేరే ప్లేట్లోకి తీసి, ఖాళీ కుక్కర్ తో ఆమె తలపై మూడుసార్లు బలంగా కొట్టాడు. తీవ్ర గాయాలు కావడంతో ఆ యువతి అక్కడికక్కడే మరణించింది. 

  దేవ సోదరి కృష్ణ ఫోన్ కాల్ ద్వారా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. కృష్ణ ఫోన్ చేయగా, దేవ ఎంతసేపటికీ స్పందించలేదు. దాంతో కృష్ణ... పొరుగింటివారికి ఫోన్ చేసింది. వారు వచ్చి చూడగా దేవ రక్తపు మడుగులో పడి ఉంది. 

ఘటన జరిగిన రోజు ఉదయం దేవ, వైష్ణవ్ తన నివాసానికి వచ్చారని, వారు పదేపదే గొడవ పడుతుండడం తాను గమనించానని కృష్ణ పోలీసులకు తెలిపింది. దేవ ఎవరికో అదే పనిగా మెసేజ్ లు పంపుతోందని వైష్ణవ్ ఆరోపించినట్టు వివరించింది. దాంతో తాను వారిద్దరికీ సర్ది చెప్పి మధ్యాహ్నం 1 గంట సమయంలో ఇంటికి పంపించానని వెల్లడించింది. 

దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న వైష్ణవ్ ను అరెస్ట్ చేశారు. పోలీసుల విచారణలో దేవను తానే హత్య చేసినట్టు ఒప్పుకున్నాడు. తాను అనేక పర్యాయాలు హెచ్చరించినా దేవ వినలేదని, మరో వ్యక్తి మోజులో పడిందని అతడు పోలీసులకు తెలిపాడు.
Advertisement
Murder
Deva
Vaishnav
Pressure Cooker
Bengaluru

More Telugu News