చార్జ్‌షీట్ కోర్టు పరిభాషలోనే ఉండాలనేం లేదు.. సుప్రీంకోర్టు స్పష్టీకరణ
- చార్జ్‌షీట్‌ను హిందీలో అనువదించి ఇవ్వాలన్న వ్యాపం కుంభకోణం కేసు నిందితులు
- చార్జ్‌షీట్ ఎలా ఉండాలన్న దానిపై నిర్దిష్ఠ నిబంధనలు లేవన్న సుప్రీం ధర్మాసనం
- ఒక్క హైకోర్టులో తప్ప మిగతా కోర్టుల్లో భాష విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలే నిర్ణయిస్తాయన్న న్యాయస్థానం
- వ్యాపం కేసు నిందితులు విద్యావంతులు కావడంతో అనువదించి ఇవ్వాల్సిన పనిలేదని స్పష్టీకరణ
మధ్యప్రదేశ్‌లో జరిగిన వ్యాపం కుంభకోణం కేసులోని ఇద్దరు నిందితులు తమకు ఇంగ్లిష్ రాదని, చార్జ్‌షీట్‌ను హిందీలో అనువదించి ఇవ్వాలని ట్రయల్ కోర్టును కోరారు. అందుకు కోర్టు అంగీకరించకపోవడంతో హైకోర్టును ఆశ్రయించారు. అక్కడ వారికి అనుకూలంగా తీర్పు రాగా, సీబీఐ సుప్రీంకోర్టులో అప్పీలు చేసింది. విచారించిన న్యాయస్థానం.. ఏ ఒక్క అంశాన్ని విస్మరించినా న్యాయం జరగదని భావించిన సందర్భాల్లో మాత్రమే నిందితులు కోరిన భాషలో చార్జ్‌షీట్‌ను ఇవ్వాల్సి ఉంటుందని పేర్కొంది. అంతేకాదు, ఈ కేసులో నిందితులు విద్యావంతులు కావడంతో చార్జ్‌షీట్‌ను హిందీలోకి అనువదించి ఇవ్వాల్సిన పనిలేదని స్పష్టం చేసింది.