తిలక్‌ వర్మను ఎందుకు తీసుకున్నామో చెప్పిన అగార్కర్

asia cup 2023 bcci chief selector ajit agarkar says picking tilak varma
  • ఐపీఎల్, వెస్టిండీస్‌ సిరీస్‌లో అదరగొట్టిన తిలక్‌ వర్మ
  • ఆసియా కప్‌లో చోటు దక్కించుకున్న తెలుగు ఆటగాడు
  • వెస్టిండీస్‌తో సిరీస్‌లో తిలక్ ఆట ఆకట్టుకుందన్న అజిత్
  • మరిన్ని అవకాశాలు ఇవ్వాలనే వన్డేల్లోకి తీసుకున్నామని వెల్లడి
మొన్నటి ఐపీఎల్‌, ఇటీవలి వెస్టిండీస్‌ సిరీస్‌లో అదరగొట్టిన తెలుగు ఆటగాడు తిలక్‌ వర్మకు ఆసియా కప్‌లో చోటు దక్కిన విషయం తెలిసిందే. తొలిసారి ఓ మేజర్‌‌ టోర్నీలో తిలక్ భాగం కాబోతున్నాడు. ఈ నేపథ్యంలో అతడి ఎంపికపై చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ కీలక వ్యాఖ్యలు చేశాడు.

వెస్టిండీస్‌తో సిరీస్‌లో తిలక్ ఆట ఆకట్టుకుందని అజిత్ చెప్పాడు. అతనికి మరికొన్ని అవకాశాలు ఇవ్వాలనే వన్డేల్లోకి తీసుకున్నామని తెలిపాడు. ఎడం చేతి వాటం కూడా ఉండటం అదనపు అర్హత అని అగార్కర్ వివరించాడు. 

మరోవైపు ఆసియా కప్‌నకు ఎంపిక చేసిన వారి నుంచే.. వరల్డ్‌కప్‌ టీమ్‌ను ఎంచుకోవడం ఖాయమని అజిత్ అగార్కర్ వివరించాడు. అన్ని మ్యాచ్‌లు చూసిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని చెప్పాడు. రెండో స్పిన్నర్‌‌ను జట్టులోకి తీసుకునే అవకాశం లేకపోవడంతో చహల్‌ను పక్కన పెట్టినట్లు వివరించాడు.
Go Back to Shorts
tilak varma
ajit agarkar
asia cup
BCCI
chief selector

More Telugu News