ప్రియుడితో బిగ్ బాస్ ఫేమ్ కీర్తి ఎంగేజ్ మెంట్

Big Boss fame Keerthi engagement
  • కార్తీకదీపం సీరియల్ తో గుర్తింపు పొందిన కీర్తి
  • తన ప్రియుడు కార్తీక్ తో ఎంగేజ్ మెంట్
  • హాజరైన సెలబ్రిటీలు, సీరియల్ యాక్టర్లు
బిగ్ బాస్ ఫేం కీర్తి పెళ్లి పీటలు ఎక్కబోతోంది. తన ప్రియుడు కార్తీక్ తో ఆమె నిశ్చితార్థం వైభవంగా జరిగింది. ఈ వేడుకకు సీరియల్ నటీనటులు, సెలబ్రిటీలు హాజరయ్యారు. కార్తీకదీపం నటిగా కీర్తి మంచి గుర్తింపు పొందింది. బిగ్ బాస్ షోతో ఆమె ప్రేక్షకులకు మరింత చేరువయింది. కీర్తి ప్రియుడు కార్తీక్ కూడా నటుడే. కొరియోగ్రాఫర్ గా కెరీర్ ను ప్రారంభించిన కార్తీక్ పలు కన్నడ సినిమాల్లో నటించాడు. అంతేకాదు ఒక సినిమాకు దర్శకత్వం కూడా వహించాడు. తెలుగులో పలు వెబ్ సిరీస్ లలో నటించాడు. 

కీర్తి పూర్తి పేరు కీర్తి భట్. బెంగళూరులో జన్మించిన కీర్తికి చిన్నతనం నుంచే సినిమాలపై ఆసక్తి ఉంది. దీంతో ఆమె నటనలో శిక్షణ తీసుకుంది. డ్యాన్స్ కూడా నేర్చుకుంది. కన్నడ సినీరంగం నుంచి ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. 2017లో 'ఐస్ మహల్' అనే సినిమాతో అరంగేట్రం చేసింది. ఆరేళ్ల క్రితం ఒక రోడ్డు ప్రమాదంలో ఆమె కుటుంబం మొత్తాన్ని కోల్పోయింది.
Go Back to Shorts
Keerthi
Big Boss
Engagement

More Telugu News