ఆరు రోజుల్లోను అదే జోరు .. నైజామ్ లో భారీ లాభాలను తెచ్చిపెట్టిన 'జైలర్'
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఆరు రోజుల్లోను అదే జోరు .. నైజామ్ లో భారీ లాభాలను తెచ్చిపెట్టిన 'జైలర్'

Jailer movie update
  • ఈ నెల 10వ తేదీన విడుదలైన 'జైలర్'
  • రజనీకాంత్ కి దక్కిన మరో బ్లాక్ బస్టర్
  • తమిళనాట వసూళ్ల జోరు  
  • తెలుగు రాష్ట్రాల్లోను అదే హవా 

తెలుగు రాష్ట్రాల్లో రజనీకాంత్ 'జైలర్' ఇప్పుడు ఒక రేంజ్ లో దూసుకుపోతోంది. సన్ పిక్చర్స్ బ్యానర్ పై నిర్మితమైన ఈ సినిమాకి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించాడు. అనిరుధ్ సంగీతాన్ని అందించిన ఈ సినిమా, ఈ నెల 10వ తేదీన థియేటర్లకు వచ్చింది. దిల్ రాజు - ఏసియన్ సునీల్ ఈ సినిమాను ఇక్కడ రిలీజ్ చేశారు.

అటు తమిళనాడులోనే కాదు .. ఇటు తెలుగు రాష్ట్రాల్లోను ఈ సినిమా డే వన్ నుంచి భారీ వసూళ్లను రాబడుతూ దూసుకుపోతోంది. ముఖ్యంగా నైజాం ఏరియాలో ఈ సినిమా 4 కోట్లకిపైగా బిజినెస్ జరుపుకోగా, 6 రోజుల్లో 8 కోట్లకి పైగా లాభాలు వచ్చాయని అంటున్నారు. ఈ మధ్య కాలంలో చాలా తక్కువ రోజులలో ఎక్కువ లాభాలను రాబట్టిన సినిమాగా చెబుతున్నారు. 

కథ .. స్క్రీన్ ప్లే .. కామెడీ .. యాక్షన్ సీన్స్ ను డిజైన్ చేసిన తీరు .. ఎమోషన్స్ ను కనెక్ట్ చేసిన విధానం ఆడియన్స్ కి బాగా నచ్చాయి. ఇక హీరోయిజంతో పాటు విలన్ రోల్ ను డిజైన్ చేసిన తీరు కూడా హ్యాట్సాఫ్ అనిపించుకుంది. విలనిజం ఈ రేంజ్ లో ఉండాలనే విధంగా చేసిన వినాయకన్ ఇప్పుడు ప్రశంసలు అందుకుంటున్నాడు. 

Advertisement
Rajanikanth
Ramyakrishna

More Telugu News