నా అన్న కొడుకుతో సమావేశమైతే తప్పేంటి?: శరద్ పవార్ సూటి ప్రశ్న
- శరద్ పవార్-అజిత్ పవార్ రహస్య సమావేశంతో ‘మహా’రాజకీయాల్లో కలకలం
- ఈ సమావేశం గురించి శరద్ పవార్‌కు మీడియా ప్రశ్నలు
- ఓ కుటుంబ పెద్ద ఇతర కుటుంబసభ్యులతో సమావేశమైతే తప్పేంటన్న శరద్ పవార్
ఈ నేపథ్యంలో, బాబాయ్-అబ్బాయ్ మళ్లీ రహస్యంగా సమావేశమయ్యారన్న వార్త రాష్ట్రంలో పెద్ద చర్చకే దారి తీసింది. నెక్ట్స్ ఏం జరగబోతోందా? అన్న ఉత్కంఠ మొదలైంది. ఈ క్రమంలో మీడియా ప్రతినిధులు శరద్ పవార్ వద్ద ఈ రహస్య సమావేశం ప్రస్తావన తెచ్చారు.
‘‘అజిత్ నా అన్న కొడుకు..అతడితో సమావేశమైతే తప్పేంటి. ఓ కుటుంబ పెద్ద ఇతర కుటుంబ సభ్యులతో మాట్లాడాలనుకుంటే దాన్నో పెద్ద విషయంగా భావించాల్సిన అవసరం లేదు’’ అని శరద్ పవార్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. అంతేకాకుండా, తమ పార్టీ బీజేపీకి మద్దతు పలకదని ఆయన తేల్చి చెప్పారు. కొందరు తన అభిప్రాయాన్ని మార్చే ప్రయత్నం చేస్తున్నా అది అసంభవమని వ్యాఖ్యానించారు.