చంద్రబాబు రేపు గాలి, నీరు తానే కనిపెట్టానని చెబుతారేమో!: విజయసాయిరెడ్డి

Vijayasaireddy satire on Chandrababu Naidu
  • టీడీపీ అధినేత ఫ్రాంక్లిన్, ఫారెడీలను మించిపోయారని చురకలు
  • మైక్ ఇస్తే ఏదేదో మాట్లాడుతారని విమర్శలు
  • టీడీపీ, బీజేపీ, జనసేన మధ్య రెండో స్థానానికి గట్టిపోటీ
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్ (ఎక్స్) ద్వారా విమర్శలు గుప్పించారు. చంద్రబాబు గారు... బెంజమిన్ ఫ్రాంక్లిన్, మైఖేల్ ఫారెడీలను మించిపోయారని, సరికొత్త పద్ధతిలో విద్యుత్‌ను కనిపెట్టారని ఎద్దేవా చేశారు. మైక్ ఇస్తే చాలు ఏదో మాట్లాడుతున్నారన్నారు. రెండు రోజుల తర్వాత గాలి, నీరు కూడా తానే కనిపెట్టానని అంటారేమో.. హతవిధీ! అని ట్వీట్ చేశారు.

మరో ట్వీట్‌లో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి 51 శాతం ఓట్లు రావడం ఖాయమని విజయసాయి ధీమా వ్యక్తం చేశారు. 2024లో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో రెండో స్థానానికి గట్టి పోటీ ఏర్పడిందని, ఆ ఎన్నికల్లో టీడీపీ ఓటర్లు జనసేన పార్టీకి, జనసేన పార్టీ ఓటర్లు బీజేపీకి మారుతారనే అభిప్రాయం బలంగా ఉందని ఎద్దేవా చేశారు. ఏది ఏమైనా వైసీపీ మాత్రం 51 శాతం ఓటింగ్‌తో అద్భుత విజయం సాధిస్తుందని, కాబట్టి ప్రతిపక్షాలు 2024కు బదులు 2029 ఎన్నికలపై దృష్టి సారించాలని చురకలు అంటించారు.
Go Back to Shorts
Vijayasai Reddy
Andhra Pradesh
Chandrababu
Janasena
BJP

More Telugu News