Varun Tej: 'భూమికి పట్టిన అతిపెద్ద కేన్సర్ మనిషేనేమో: 'గాండీవధారి అర్జున' ట్రైలర్ డైలాగ్

Gandeevadhari Arjuna Movie Trailer Released
షార్ట్స్‌లో చూడండి
వరుణ్ తేజ్ హీరోగా బీవీఎస్ ఎన్ ప్రసాద్ నిర్మాణంలో 'గాండీవధారి అర్జున' సినిమా రూపొందింది. ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఈ నెల 25వ తేదీన విడుదల కానుంది. యాక్షన్ ఎంటర్టయినర్ నేపథ్యంలో నడిచే ఈ సినిమా నుంచి కొంతసేపటి క్రితం ట్రైలర్ ను రిలీజ్ చేశారు.

యాక్షన్ .. ఛేజింగ్ .. ఎమోషన్స్ .. సస్పెన్స్ తో కూడిన సన్నివేశాలపై కట్ చేసిన ఈ ట్రైలర్ ఉత్కంఠను పెంచుతోంది. యాక్షన్ సీన్స్ ను ఒక రేంజ్ లో డిజైన్ చేశారనే విషయం ట్రైలర్ ను బట్టి తెలుస్తోంది. ఫారిన్ లొకేషన్స్ లోనే కథను పరిగెత్తించారనే విషయం అర్థమవుతోంది. 'భూమికి పట్టిన అతిపెద్ద కేన్సర్ మనిషేనేమో' అంటూ నాజర్ చెప్పిన డైలాగ్ ఈ ట్రైలర్ కి హైలైట్.  

ఈ సినిమా చిత్రీకరణ దాదాపు విదేశాల్లోనే కొనసాగింది. కొన్ని పాటలను .. భారీ యాక్షన్ దృశ్యాలను అక్కడే చిత్రీకరించారు. వరుణ్ తేజ్ సరసన నాయికగా సాక్షి వైద్య సందడి చేయనుంది. మిక్కీ జె మేయర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణగా నిలవనున్నాయి. ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని రాబడుతుందనేది చూడాలి.



Go Back to Shorts
Varun Tej
Sakshi Vaidya
Gandeevadhari Arjuna

More Telugu News