మోహన్ లాల్, రోష‌న్ మేకా తండ్రీకొడుకులుగా ‘వృషభ’... చిత్రబృందంలో చేరిన హాలీవుడ్ ప్రొడ్యూసర్ నిక్ తుర్లో
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మోహన్ లాల్, రోష‌న్ మేకా తండ్రీకొడుకులుగా ‘వృషభ’... చిత్రబృందంలో చేరిన హాలీవుడ్ ప్రొడ్యూసర్ నిక్ తుర్లో

Hollywood executive producer Nick Thurlow join hands with Vrushabha movie team
  • నందకిశోర్ దర్శకత్వంలో వృషభ
  • పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్ తో మేకింగ్
  • హాలీవుడ్ నిర్మాత నిక్ తుర్లో భాగస్వామ్యంతో వృషభకు భారీ హైప్
మ‌ల‌యాళ సూప‌ర్ స్టార్ మోహన్ లాల్, రోషన్ మేకా (నటుడు శ్రీకాంత్ తనయుడు), షనాయా కపూర్‌, జహ్రా ఖాన్‌ల‌తో పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తున్న చిత్రం ‘వృషభ’. ఈ సినిమాకు నందకిశోర్ దర్శకుడు. 

ఈ భారీ బడ్జెట్ ప్రాజెక్టులో ఇప్పుడు హాలీవుడ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ నిక్ తుర్లో భాగస్వామి అయ్యారు. మూన్ లైట్ (2016), థ్రీ బిల్‌బోర్డ్స్ అవుట్ సైడ్ ఎబ్బింగ్, మిస్సోరీ (2017) వంటి ఎన్నో హాలీవుడ్ సినిమాలు నిక్ తుర్లో నిర్మించారు. హాలీవుడ్ లో పలు చిత్రాలకు సహ నిర్మాతగా వ్యవహరించారు. వృషభ టీంలోకి నిక్ తుర్లో రావడంతో ఈ సినిమాకు హాలీవుడ్ రేంజ్ హైప్ లభించినట్టయింది. 

తాజాగా, ఈ చిత్రానికి సంబంధించిన 57 సెకన్ల వీడియోను రిలీజ్ చేశారు. ఇందులో సినిమాలోని సెట్స్, ఎంత భారీగా తెరకెక్కించబోతున్నారనే విషయాన్ని చూపించారు. హాలీవుడ్ స్టైల్‌ను ఫాలో అవుతూ తీస్తున్న మొదటి సినిమాగా వృషభ గుర్తింపు తెచ్చుకుంది. 

కాగా, హాలీవుడ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ నిక్ తుర్లో మాట్లాడుతూ... వృషభ చిత్రంతో తాను భారత చిత్ర పరిశ్రమలోకి ప్రవేశిస్తున్నానని వెల్లడించారు. ఈ సినిమాలో తాను భాగస్వామి అవడం ఎంతో ఆనందం కలిగిస్తోందని తెలిపారు. 

"హాలీవుడ్ కాకుండా ఇతర దేశాల్లో నేను పని చేస్తున్న మొదటి సినిమా ఇది. అలానే నేను ఫస్ట్ టైం ఓ బహు భాషా చిత్రానికి పని చేస్తున్నాను. నేను ప్రతీ సినిమాను మొదటి సినిమాలానే ఫీల్ అవుతాను. ప్రతీ సినిమా నుంచి ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకుంటూ ఉంటాను... వృషభ సైతం అలాంటి ఓ అందమైన ప్రయాణం అవుతుందని ఆశిస్తున్నాను" అని వివరించారు. 

నిర్మాత విశాల్ గుర్నాని మాట్లాడుతూ, హాలీవుడ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ నిక్ తుర్లో వంటి వారు తమ ప్రాజెక్టులోకి రావడం ఓ కలలా ఉందని తెలిపారు. ఇలాంటి కల కనడానికి కూడా సాధ్యం కాదని అన్నారు. కానీ ఆయన తమ బృందంలోకి రావడంతో వృషభ స్థాయి పెరిగిందని సంతోషం వ్యక్తం చేశారు. నిక్ తుర్లో భాగస్వామ్యంతో సినిమాకు భారీతనం వచ్చిందని తెలిపారు. 

"హాలీవుడ్ స్థాయిలో తెరకెక్కించబోతున్న మొదటి ఇండియన్ సినిమాగా వృషభ రికార్డులకెక్కింది. మా వృషభ టీం మీద నమ్మకంతో ప్రాజెక్టులోకి వచ్చిన నిక్ తుర్లోకి ధన్యవాదాలు" అని పేర్కొన్నారు. 

తండ్రీ కొడుకుల మధ్య వచ్చే హై ఆక్టేన్ ఎమోషనల్ డ్రామాగా వృషభ రాబోతోంది. మెగాస్టార్ మోహన్ లాల్, రోషన్ మేకా, షనాయా కపూర్, జహ్రా ఖాన్, శ్రీకాంత్ మేకా, రాగిణి ద్వివేది ఈ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో ఎమోషన్స్, వీఎఫ్ఎక్స్, యాక్షన్ సీక్వెన్స్ భారీ ఎత్తున చూపించబోతున్నారు. వచ్చే ఏడాది రిలీజ్ కాబోతోన్న అతి పెద్ద ప్రాజెక్టుల్లో వృషభ సైతం ఒకటి కానుంది. 

కనెక్ట్ మీడియా, బాలాజీ టెలీఫిల్మ్స్, ఏవీఎస్ స్టూడియోస్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. అభిషేక్ వ్యాస్, విశాల్ గుర్నాని, జుహీ పరేఖ్ మెహతా, శ్యామ్ సుందర్, ఏక్తా కపూర్, శోభా కపూర్, వరుణ్ మథూర్, సౌరభ్ మిశ్రాలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఏకకాలంలో తెలుగు, మలయాళ భాషల్లో తెరకెక్కిస్తున్న ఈ మూవీని హిందీ, కన్నడ, తమిళ భాషల్లోనూ రిలీజ్ చేయబోతున్నారు.
Advertisement
Nick Thurlow
Hollywood
Executive Producer
Vrushabha
Mohan Lal
Roshan Meka
Nanda Kishore

More Telugu News