'దయా'గా జేడీ చక్రవర్తి .. హాట్ స్టార్ ట్రాక్ పైకి వస్తున్న వెబ్ సిరీస్!
- 'దయా'గా కనిపించనున్న జేడీ
- దర్శకత్వం వహించిన పవన్ సాధినేని
- కీలకమైన పాత్రను పోషించిన ఈషా రెబ్బా
- ఈ నెల 4 నుంచి హాట్ స్టార్ లో స్ట్రీమింగ్
ఈ వెబ్ సిరీస్ లో జేడీ కాస్త వినికిడి లోపం గల పాత్రలో .. ఒక వ్యాన్ డ్రైవర్ గా కనిపించనున్నాడు. ఒక రోజున అతని వ్యాన్ లో అతనికి తెలియకుండా ఎవరో ఒక శవాన్ని పడేసి వెళ్లిపోతారు. ఆ శవాన్ని చూసి కంగారు పడిపోయిన దయా, ఎవరికీ తెలియకుండా దానిని వదిలించుకోవడానికి ప్రయత్నిస్తాడు. అయితే అదే అతను చేసిన పొరపాటు అవుతుంది.
ఆ శవం ఎవరిది? ఆ కేసులో దయా ఎలా చిక్కున్నాడు? అందులో నుంచి బయటపడటానికి ఆయన ఏం చేశాడు? అనే ఆసక్తికరమైన మలుపులతో ఈ కథ ముందుకు వెళుతుంది. జేడీ చక్రవర్తి భార్య పాత్రలో ఈషా రెబ్బా నటించగా, రమ్య నంబీసన్ .. కమల్ కామరాజు .. జోష్ రవి .. యాంకర్ విష్ణుప్రియ ముఖ్యమైన పాత్రలను పోషించారు.