అమెరికాలో దారుణం.. మహిళను కత్తితో పొడిచి చంపి.. ఆమె చివరి క్షణాలను ఫేస్‌బుక్‌లో షేర్ చేసిన నిందితుడు
- అమెరికాలోని బే ఏరియాలో ఘటన
- ఫేస్‌బుక్‌లో వీడియో చూసి పోలీసులకు సమాచారమిచ్చిన నెటిజన్
- రెండు గంటల్లోనే నిందితుడికి బేడీలు
హత్యకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. మహిళను హత్య చేసిన నిందితుడు ఆమె చివరి క్షణాలను వీడియో తీసి దానిని ఫేస్‌బుక్‌లో పోస్టు చేసిన తర్వాత అక్కడి నుంచి పరారయ్యాడు. నిందితుడిని రెండు గంటల్లోనే అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు.