అమెరికాలో పిడుగుపాటుకు గురైన తెలుగమ్మాయి సుశ్రూణ్యకు ప్రాణాపాయం లేదన్న వైద్యులు

అమెరికాలో పిడుగుపాటుకు గురైన తెలుగమ్మాయి సుశ్రూణ్యకు ప్రాణాపాయం లేదన్న వైద్యులు

Doctors says Susroonya have no life threat
  • జులై మొదటివారంలో హూస్టన్ లో పిడుగుపాటు
  • కోమాలోకి వెళ్లిన సుశ్రూణ్య కోడూరు
  • వెంటిలేటర్ పై చికిత్స
  • కోమాలోంచి బయటికి వచ్చిన సుశ్రూణ్య
తెలుగమ్మాయి సుశ్రూణ్య కోడూరు ఇటీవల అమెరికాలో పిడుగుపాటుకు గురైన సంగతి తెలిసిందే. 25 ఏళ్ల సుశ్రూణ్య యూనివర్సిటీ ఆఫ్ హూస్టన్ లో ఐటీ సబ్జెక్టులో మాస్టర్స్ డిగ్రీ చదువుతోంది. ఆమె తల్లిదండ్రులు హైదరాబాదులో ఉంటున్నారు. 

అమెరికాలో ఈ నెల మొదటి వారంలో సుశ్రూణ్య ఓ పార్కు వద్ద పిడుగుపాటుకు గురై పక్కనే ఉన్న నీటి కుంటలో పడిపోయింది. ఆమెను స్నేహితులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. అప్పటి నుంచి సుశ్రూణ్య కోమాలోనే ఉంది. నీటిలో పడిపోయిన సమయంలో గుండె పనితీరు 20 నిమిషాల పాటు అస్తవ్యస్తం కావడంతో మెదడు స్తంభించిపోయింది. 

ఆసుపత్రికి తీసుకువచ్చే సమయానికి ఆమె దాదాపుగా అచేతనంగా ఉంది. దాంతో, ఆమె ఆరోగ్య పరిస్థితిపై తీవ్ర ఆందోళన నెలకొంది. తాజాగా, ఆమె కోమా నుంచి బయటికి రావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. సుశ్రూణ్యకు ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. వెంటిలేటర్ ను కూడా తొలగించారు. ఆమె ఆరోగ్య పరిస్థితిని వైద్యులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. 

కాగా, హైదరాబాదులో ఉన్న సుశ్రూణ్య తల్లిదండ్రులకు వీసాలు మంజూరు కావడంతో వారు త్వరలో అమెరికా చేరుకోనున్నారు.
Advertisement
Susroonya
Lightening
Houston
USA
Hyderabad
Telangana

More Telugu News