'బేబి'ని రీమేక్ చేసే ఆలోచనలో నయనతార భర్త విఘ్నేశ్ శివన్!

Baby Movie Update
  • తెలుగులో తగ్గని 'బేబి' వసూళ్ల జోరు 
  • 100 కోట్ల దిశగా వెళుతున్న సినిమా 
  • రీమేక్ హక్కుల కోసం బడా నిర్మాతల పోటీ 
  • తెరపైకి వచ్చిన విఘ్నేశ్ శివన్ పేరు  
తెలుగులో ఈ మధ్య కాలంలో పెద్ద హిట్ కొట్టిన సినిమాలలో 'బేబి' ఒకటి. ఆనంద్ దేవరకొండ .. వైష్ణవి చైతన్య .. విరాజ్ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమాను, ఎస్ కె ఎన్ నిర్మించాడు. సాయిరాజేశ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఈ నెల 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వారం తిరక్కుండానే ఈ సినిమా 50 కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది. 

ఇది ప్రేమకథా చిత్రమే అయినా .. బోల్డ్ కంటెంట్ తో వచ్చింది. ఈ జనరేషన్ కి ఈ సినిమా బాగా కనెక్ట్ అయింది. అందువలన 12 రోజుల్లోనే ఈ సినిమా 70 కోట్ల మార్కును దాటేసింది .. 100 కోట్ల మార్కు దిశగా పరుగులు పెడుతోంది. దాంతో ఈ సినిమా రీమేక్ హక్కులకి విపరీతమైన డిమాండ్ ఏర్పడిందని టాక్. రీమేక్ హక్కుల కోసం భారీ నిర్మాణ సంస్థలే బరిలోకి దిగాయని అంటున్నారు. 

ఈ నేపథ్యంలోనే తమిళ రీమేక్ హక్కులకు సంబంధించి, నయనతార భర్త విఘ్నేశ్ శివన్ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. ఈ సినిమా టీమ్ ను అభినందిస్తూ ఆయన చేసిన పోస్ట్ నేపథ్యంలో, ఆయన ఈ సినిమాను తమిళంలో రీమేక్ చేయనున్నట్టుగా చెబుతున్నారు. అందుకు తగిన సంకేతాలు కూడా కనిపిస్తున్నాయి. ఒకవేళ ఆయన తమిళంలో రీమేక్ చేస్తే, వైష్ణవిని తీసుకునే అవకాశాలే ఎక్కువని అంటున్నారు. 

Go Back to Shorts
Vighnesh Shivan
Vaishnavi
Anand Devarakonda
Viraj
Baby

More Telugu News