కాంగ్రెస్ నేతలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన తలసాని శ్రీనివాస్ యాదవ్
- బీసీ కులాలను కాంగ్రెస్ నేతలు కించపరుస్తున్నారన్న తలసాని
- తాము తెగిస్తే దేనికీ భయపడమని వ్యాఖ్య
- బీసీలందరినీ ఏకం చేసి కాంగ్రెస్ అంతు చూస్తామని హెచ్చరిక
బీసీ నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే లబ్ధి కలుగుతుందని మీరు భావిస్తే అది మీ ఖర్మ అని తలసాని చెప్పారు. బీసీల సమస్యలన్నీ తమకు తెలుసని అన్నారు. త్వరలోనే హైదరాబాద్ లో బీసీలతో భారీ బహిరంగసభను నిర్వహిస్తామని చెప్పారు. ఇప్పటికైనా కాంగ్రెస్ నేతలు కళ్లు తెరవాలని... లేకపోతే ఆ పార్టీ భూస్థాపితం అవుతుందని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా బీసీలందరినీ ఏకం చేసి కాంగ్రెస్ అంతు చూస్తామని హెచ్చరించారు.