Kota Srinivasa Rao: అలా చేసినందుకు చిరంజీవి నాపై కోప్పడ్డారు: కోట శ్రీనివాసరావు

Kota Srinivasa Rao Interview
షార్ట్స్‌లో చూడండి
వయసు పై బడిన కారణంగా ఈ మధ్య కోట శ్రీనివాసరావు సినిమాలను పూర్తిగా తగ్గించారు. చాలా గ్యాప్ తరువాత ఆయన ఒక తెలుగు వెబ్ సిరీస్ లో కనిపించారు. రీసెంటుగా ఐడ్రీమ్ వారికి ఇచ్చిన ఇంటర్వ్యూలో కోట మాట్లాడుతూ .. "నా కెరియర్లో నా పై చాలా రూమర్స్ వచ్చాయి. తాగేసి షూటింగుకి వెళితే డైరెక్టర్ కొట్టాడనీ, ఎవరో అమ్మాయిని ఏదో అంటే ఆమె కొట్టిందనీ .. ఎప్పుడు చూసినా తాగుతూనే ఉంటాడని ఎన్నో పుకార్లు వచ్చాయి" అన్నారు.

"నేను పత్తిత్తును అని చెప్పడం లేదు .. కానీ సినిమాలకి సంబంధించినంత వరకూ చాలా జాగ్రత్తగా ఉంటూ వచ్చాను. లేకపోతే అంత కాలం పాటు అన్ని సినిమాలు ఎలా చేస్తాను. నా బిహేవియర్ బాగోలేకపోతే ఇంత కెరియర్ ఉండదు కదా. నాలో మంచితనం అనేది లేకపోతే .. మంచివాడిని కాకపోతే భగవంతుడు నాకు ఎలా సాయం చేస్తాడు? పెద్దగుమ్మడికాయంత టాలెంట్ ఉంటే సరిపోదు .. ఆవగింజంత అదృష్టం కూడా ఉండాలి. ఆ రెండూ ఉన్నవాడే 'కోట' అని అన్నారు. 

"ఒకసారి మాత్రం షూటింగుకి వెళితే మధ్యాహ్నం వరకూ నా షాట్ లేదని చెప్పారు. ఎమ్మెస్ వత్తిడి చేస్తే సెట్లోనే కాస్త మందు పుచ్చుకున్నాను. కానీ ఆ వెంటనే షాట్ కి పిలిచారు. ఇలా జరిగిందేంటబ్బా అనుకుంటూనే షాట్ కి వెళ్లాను. నేను తాగేసి షూటింగుకి వచ్చాననే విషయం చిరంజీవిగారికి తెలిసింది. ఎంతో టాలెంట్ పెట్టుకుని ఇలా చేస్తే, కెరియర్ దెబ్బతింటుందంటూ ఆయన నా మేలు కోరి చెబుతూ, కోప్పడ్డారు" అంటూ చెప్పుకొచ్చారు.  
Go Back to Shorts
Kota Srinivasa Rao
Chiranjeevi
Tollywood

More Telugu News