సస్పెన్స్ ను రివీల్ చేయవద్దంటున్న 'హిడింబ' టీమ్!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సస్పెన్స్ ను రివీల్ చేయవద్దంటున్న 'హిడింబ' టీమ్!

Hidimba Movie Update
  • రేపు విడుదల కానున్న 'హిడింబ'
  • సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్లో సాగే సినిమా
  • టైటిల్ తోనే ఆసక్తిని పెంచిన 'హిడింబ'
  • చాలా గ్యాప్ తరువాత అశ్విన్ చేసిన మూవీ
ఈ మధ్య కాలంలో ఏ సినిమా విడుదలైనా, థియేటర్ బయటికి రాగానే ఆ సినిమా ఎలా ఉందనేది మీడియాతో ఆడియన్స్ చెబుతున్నారు. సినిమా ఎలా ఉందనేది ఒక మాటలో చెబితే ఫరవాలేదు .. కానీ ఇంటర్వెల్ బ్యాంగ్ .. క్లైమాక్స్ తో సహా చెబుతున్నారు. సస్పెన్స్ కూడా రివీల్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా ఇదే పద్ధతి ఫాలో అవుతున్నారు. 

ఇతర జోనర్లకి సంబంధించిన సినిమాల విషయం అటుంచితే, సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్ కి సంబంధించిన సినిమాలకి ఇది ఎక్కువగా ఎఫెక్ట్ అవుతుంది. సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలకి రిపీట్ ఆడియన్స్ ఉండకపోవడానికి కారణం ఇదే. సస్పెన్స్ రివీల్ అయితే, ఇక సినిమాపై ఇంట్రెస్ట్ పోతుంది. ఆ సినిమా గురించిన టాక్ విన్నప్పటికీ అదే ఎఫెక్టు పడుతుంది. 

అందువల్లనే 'హిడింబ' టీమ్ ఒక ప్రకటన చేసింది. అశ్విన్ బాబు హీరోగా నటించిన ఈ సినిమా, రేపు థియేటర్లకు రానుంది. సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్లో ఈ సినిమా నడుస్తుంది. అందువలన ఆ సస్పెన్స్ ను రివీల్ చేయవద్దంటూ వాళ్లు ఒక విన్నపం చేశారు. చాలా గ్యాప్ తరువాత అశ్విన్ బాబు నుంచి వస్తున్న ఈ సినిమా, ఎలాంటి రిజల్టును రాబడుతుందనేది చూడాలి. 
Advertisement
Ashwin Babu
Nanditha Swetha
Hidimba

More Telugu News