ప్రభుత్వాధికారి బదిలీ..ఫేర్‌వెల్ పార్టీలో బార్ డ్యాన్సర్ నృత్యం.. వీడియో ఇదిగో!
- బీహార్‌లోని ఖగారియా జిల్లాలో జరిగిన ఘటన
- బ్లాక్ డెవలెప్‌మెంటల్ ఆఫీసర్ బదిలీ
- ఆయన కోసం ఏర్పాటు చేసిన ఫేర్‌వెల్ పార్టీలో బార్ డ్యాన్సర్ నృత్యం
- నెట్టింట వీడియో వైరల్, అధికారుల తీరుపై విమర్శల వెల్లువ
- ఘటనపై దర్యాప్తునకు జిల్లా మెజిస్ట్రేట్ ఆదేశం
ఈ పార్టీలో ప్రభుత్వాధికారులు అనేక మంది పాల్గొన్నట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి. అధికార యంత్రాంగానికి ఈ ఘటనతో తలవంపులు రావడంతో జిల్లా మెజిస్ట్రేట్ రంగంలోకి దిగారు. ఫేర్‌వేల్ పార్టీ ఎవరు ఏర్పాటు చేశారు? ఎవరెవరు పాల్నొన్నారనే విషయాలను వెలికితీసేందుకు దర్యాప్తునకు ఆదేశించారు.