tv: కాల్పులు జరిపిన మనోజ్‌ను నేను కాదు.. పరువుకు భంగం కలిగించారు: టీవీ నటుడు

TV actor Manoj clarifies on Shamirpet firing issue
షార్ట్స్‌లో చూడండి
శామీర్‌పేట సెలబ్రిటీ క్లబ్‌లో కాల్పుల ఘటన కలకలం రేపింది. సిద్ధార్థదాస్ అనే వ్యక్తిపై మనోజ్ కుమార్ ఎయిర్ గన్ తో కాల్పులు జరిపాడు. అయితే ఈ కాల్పుల నుండి సిద్ధార్థ తప్పించుకొని, శామీర్ పేట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. ఈ కాల్పులు జరిపిన మనోజ్ పలు టీవీ సీరియళ్లలో నటించాడంటూ ప్రచారం సాగింది. దీనిపై టీవీ సీరియల్స్ నటుడు మనోజ్ తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా వివరణ ఇచ్చారు.

తాను కార్తీక దీపంలో ప్రేమ్ గా నటించానని, ఇప్పుడు మౌనపోరాటంలో నటిస్తున్నానని, ఈ రోజు ఉదయం నుండి ఓ తప్పుడు వార్త జోరుగా చక్కర్లు కొడుతోందని వాపోయాడు. సెలబ్రిటీ క్లబ్ లో కాల్పులు జరిపిన మనోజ్ కు బదులు తన ఫోటోలను వినియోగిస్తున్నారని, తన సీరియల్ క్లిప్స్ వీడియోలు వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ విషయం తెలిసి తన స్నేహితులు, బంధువులు ఫోన్ చేసి చెప్పారని, మొదట ఇది ఫ్రాంక్ కాల్ అనుకున్నానని, ఆ తర్వాత టీవీలలో తన ఫోటో రావడం చూసి వివరణ ఇస్తున్నట్లు చెప్పారు. ఈ రోజు ఉదయం తాను బెంగళూరులో ఉన్నానని, తనకు ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. కొన్ని మీడియా సంస్థలు మనోజ్ అంటే తన ఫోటోలను ఎలా ప్రదర్శించాయని, నా పరువుకు భంగం కలిగించినందుకు ఫిర్యాదు చేయబోతున్నట్లు చెప్పారు.
Go Back to Shorts
tv
manoj
Hyderabad

More Telugu News