శామీర్ పేట్ క్లబ్ లో కాల్పుల కలకలం

Artist manoj gun fired in Shamirpet Hyderabad
  • భర్తపై కాల్పులు జరిపిన భార్య ప్రియుడు
  • పోలీసులను ఆశ్రయించిన భర్త
  • పిల్లలను చూసేందుకే అక్కడికి వెళ్లినట్లు వివరణ
హైదరాబాద్ శివార్లలోని ఓ క్లబ్ లో కాల్పుల కలకలం చోటుచేసుకుంది. శనివారం ఉదయం క్లబ్ కు వచ్చిన వారిలో ఓ యువకుడు ఎయిర్ గన్ తో కాల్పులు జరిపాడు. అయితే, ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని, కాల్పులు జరిపిన వ్యక్తిపై కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. శామీర్‌పేటలోని సెలబ్రిటీ క్లబ్‌లో సిద్ధార్థ్ దాస్ అనే వ్యక్తిపై నటుడు మనోజ్‌ నాయుడు కాల్పులు జరిపాడు. ఎయిర్‌ గన్‌తో మనోజ్ కాల్చగా.. పిల్లెట్స్‌ నుంచి తప్పించుకున్న సిద్ధార్థ్‌ దాస్‌ శామీర్‌పేట్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టారు.

సిద్ధార్థ్ దాస్ దంపతులకు ఓ కూతురు, కొడుకు ఉన్నారు. భార్యాభర్తల మధ్య విభేదాల కారణంగా ఇద్దరూ కొంతకాలంగా విడిగా ఉంటున్నారని సమాచారం. ఈ క్రమంలోనే 2019 నుంచి సిద్ధార్థ్ భార్యతో మనోజ్ నాయుడు సహజీవనం చేస్తున్నట్లు సమాచారం. భార్య దగ్గర ఉన్న తన పిల్లలను తన సంరక్షణలోకి తీసుకోవడానికి సిద్ధార్థ్ చైల్డ్ ప్రొటెక్షన్ సెల్ ను ఆశ్రయించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో అక్కను కొడుతున్నారంటూ కొడుకు ఫోన్ చేయడంతో సెలబ్రిటీ క్లబ్ కు వెళ్లానని సిద్ధార్థ్ దాస్ చెప్పారు. పిల్లలను చూసేందుకు వెళ్లానని, ఈ క్రమంలోనే గొడవ జరగగా మనోజ్ తనపై కాల్పులు జరిపాడని తెలిపారు.
Advertisement
Artist manoj
gun fire
Hyderabad
Shamirpet

More Telugu News