విద్యారంగంలో కీలక మార్పులకు శ్రీకారం చుట్టిన ఏపీ సీఎం జగన్!
- విద్యాశాఖపై ముఖ్యమంత్రి సమీక్ష
- విద్యారంగంలో టెక్నాలజీని ఉపయోగించాలని జగన్ సూచన
- మార్పులకు ఇప్పుడే నాంది పలకాలన్న సీఎం
ఇందులో భాగంగా విద్యారంగంలో కీలక మార్పులకు శ్రీకారం చుట్టినట్లు చెప్పారు. మన విద్యా విధానం ప్రపంచస్థాయిలో పోటీపడేలా ఉండాలన్నారు. మన ఫ్యాకల్టీ కూడా ఆ స్థాయిలో విద్యను అందించాలని ఆకాంక్షించారు. ఏఐ, వర్చువల్ రియాల్టీ, అగ్మెంటేషన్ రియాల్టీలను బోధనలో ఉపయోగించడంపై ప్రధానంగా చర్చించారు. ఈ సమీక్షకు హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ హేమచంద్రారెడ్డి తదితరులు హాజరయ్యారు.