యాషెస్ సిరీస్: స్టేడియం లోపలకు వెళ్లకుండా మెకల్లమ్‌ను గేటు వద్ద అడ్డుకున్న సెక్యూరిటీ
- ఎంట్రీ పాస్ కోల్పోవడంతో అతనిని గుర్తించని సెక్యూరిటీ సిబ్బంది
- మెకల్లమ్‌తో సెక్యూరిటీ సిబ్బంది వాగ్వాదం
- ఫోన్లో మాట్లాడేందుకు ప్రయత్నించిన సెక్యూరిటీపై మెకల్లమ్ ఆగ్రహం
ఎంట్రీ పాస్ లేదని మెకల్లమ్ ను స్టేడియంలోకి అనుమతించలేదు. ఇంగ్లండ్ మీడియాలో దీనికి సంబంధించిన వార్తలు వచ్చాయి. మెకల్లమ్ వద్ద ఎంట్రీ పాస్ లేకపోవడంతో అతనిని భద్రతా సిబ్బంది గుర్తించలేక, గేటు వద్దనే ఆపివేసింది. అంతేకాదు, మెకల్లమ్ తో వాగ్వాదం కూడా జరిగింది. ఈ క్రమంలో సెక్యూరిటీ గార్డ్ తన ఉన్నతాధికారులతో ఫోన్లో మాట్లాడటానికి ప్రయత్నించాడు. దీంతో సహనం కోల్పోయిన మెకల్లమ్.. తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని భద్రతా సిబ్బందిని హెచ్చరించాడు.