Advertisement

తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌తో కేంద్రమంత్రి రిజిజు భేటీ

Union Minister Kiran meets CM YS Jagan
  • రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై చర్చించినట్లుగా సమాచారం
  • ఇటీవలే ఢిల్లీ పర్యటన ముగించుకొని వచ్చిన జగన్
  • విభజన హామీలు, పోలవరం ప్రాజెక్టు తదితర అంశాలపై కేంద్ర పెద్దలకు జగన్ విజ్ఞప్తి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో కేంద్రమంత్రి కిరణ్ రిజిజు శుక్రవారం భేటీ అయ్యారు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో వీరి భేటీ జరిగింది. రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలపై ముఖ్యమంత్రితో కేంద్రమంత్రి చర్చించారని తెలుస్తోంది. 

అధికార పర్యటన కోసం రిజిజు ఆంధ్రప్రదేశ్ వచ్చారు. ముఖ్యమంత్రి జగన్ ఇటీవల ఢిల్లీకి వెళ్లారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తదితరులతో సుదీర్ఘంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా విభజన హామీలు, ఆంధ్రప్రదేశ్ కు రావాల్సిన బకాయిలు, పోలవరం ప్రాజెక్టు తదితర అంశాలపై కేంద్ర పెద్దలతో చర్చించినట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో కిరణ్ రిజిజు ఏపీకి వచ్చినట్టు తెలుస్తోంది.
Advertisement
YS Jagan
kiren rijiju
Andhra Pradesh

More Telugu News