తనపై తీవ్రస్థాయిలో పుకార్లు వస్తుండడం పట్ల కృతి శెట్టి స్పందన

Krithi Shettu condemns rumors
  • కృతి శెట్టి ఇంటర్వ్యూ అంటూ కొన్ని కథనాలు
  • ఓ స్టార్ హీరో కొడుకు వేధిస్తున్నాడని కృతి శెట్టి చెప్పినట్టు కథనాలు
  • ఖండించిన కృతి శెట్టి
  • తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ట్వీట్
ఉప్పెన చిత్రంతో టాలీవుడ్ వెండితెరకు పరిచయమై కొద్దికాలంలోనే ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించిన నటి కృతి శెట్టి. గత కొన్ని రోజులుగా కృతి శెట్టి ఇంటర్వ్యూ అంటూ పలు కథనాలు మీడియాలో దర్శనమిస్తున్నాయి. 

ఓ స్టార్ హీరో కొడుకు తనను స్నేహం పేరిట వేధిస్తున్నాడని, ఎక్కడికి వెళ్లినా తోడు రమ్మంటున్నాడని కృతి శెట్టి చెప్పినట్టు ఆ కథనాల్లో పేర్కొన్నారు. 

ఈ కథనాలపై నటి కృతి శెట్టి స్పందించారు. ఈ వార్తల్లో ఎంతమాత్రం నిజం లేదని స్పష్టం చేశారు. తానెప్పుడూ అలా చెప్పలేదని కొట్టిపారేశారు. ఈ పుకార్లను పట్టించుకోకూడదని భావించానని, కానీ తప్పుడు ప్రచారం తీవ్రస్థాయిలో జరుగుతుండడంతో స్పందించక తప్పలేదని వివరణ ఇచ్చారు. 

అవన్నీ నిరాధారమైన వార్తలని, వాటిని ఎవరూ నమ్మవద్దని స్పష్టం చేశారు. ఈ మేరకు కృతి శెట్టి ట్వీట్ చేశారు. ఇలాంటి తప్పుడు కథనాలు వండి వార్చడం ఆపేయాలని ఆయా మీడియా సంస్థలకు హితవు పలికారు.
Go Back to Shorts
Krithi Shetty
Rumors
Star Hero
Son
Actress
Tollywood

More Telugu News