యువకుడి చెంప ఛెళ్లుమనిపించిన యువతి.. మెట్రోలో షాకింగ్ సన్నివేశం
- ఢిల్లీ మెట్రోలో మరో షాకింగ్ సన్నివేశం
- యువతీయువకుల మధ్య వాగ్వాదం, చెంప ఛెళ్లుమనిపించిన యువతి
- మౌన ప్రేక్షకులుగా మారిపోయిన ఇతర ప్రయాణికులు
- నెట్టింట వీడియో వైరల్
అసలు వీరిద్దరి మధ్య వివాదం ఎందుకు మొదలైందన్నది తెలియరాలేదు. అయితే, వారిద్దరూ పరిచయస్తులేనన్న కామెంట్స్ సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. ఇంత జరుగుతున్నప్పటికీ అక్కడున్న వారెవరూ స్పందించకపోవడంపై కొందరు నెటిజన్లు విచారం వ్యక్తం చేశారు. ‘‘అదే యువకుడు గనుక మహిళపై చేయి ఎత్తి ఉంటే సీన్ మరోలా ఉండేది. అక్కడ ఉన్నది మహిళ కాబట్టి ఎవరి మానాన వారు మిన్నకుండిపోయారు’’ అని మరికొందరు అభిప్రాయపడ్డారు. నెట్టింట వైరల్‌గా మారిన ఈ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి!