పట్టణ పేదలకు అలాంటి పథకం తేవాలని కోరిన మంత్రి కేటీఆర్
- వచ్చే బడ్జెట్ లో ఇందుకోసం ఓ పథకాన్ని రూపొందించాలని విజ్ఞప్తి
- పట్టణ జనాభా రోజు రోజుకు పెరుగుతోందని, ఇది సంక్లిష్టంగా మారనుందని వ్యాఖ్య
- హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టుకు అనుమతులు, నిధులు కోరిన కేటీఆర్
అందుకే గ్రామీణ స్థాయిలో ఉపాధి హామీ పథకం ఉన్నట్లే పట్టణ పేదలకు ఓ పథకం తీసుకు రావాలని కోరారు. ఈ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం జాబ్ కార్డులు జారీ చేసి నగరస్థాయిలో వారి సేవలను వినియోగించుకుంటుందన్నారు. అదే సమయంలో హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు ఫేజ్ 2 (బీ) పనులకు అనుమతులు మంజూరు చేయడంతో పాటు ఫేజ్ 1లోని కారిడార్ 3లోని నాగోల్ - ఎల్బీనగర్ మెట్రో విస్తరణకు నిధులు సమకూర్చాలని కోరారు. లింక్ రోడ్లకు, ఘన వ్యర్థాల నిర్వహణ ప్రాజెక్టు, హైదరాబాద్ - వరంగల్ మధ్య వేగవంతమైన రవాణా వ్యవస్థ, శానిటేషన్ హబ్ ఏర్పాటు వంటి అంశాలను ప్రస్తావించారు.