తెలంగాణలో మెడికల్ కాలేజీలు, కార్యాలయాల్లో కొనసాగుతున్న ఈడీ సోదాలు
- 20కి పైగా ప్రాంతాల్లో దాడలు చేస్తున్న ఈడీ బృందాలు
- పీజీ మెడికల్ సీట్లు బ్లాక్ చేసి అమ్ముకున్నారన్న అభియోగాలు
- కాళోజీ యూనివర్సిటీ ఫిర్యాదు మేరకు గతేడాది వరంగల్ లో కేసు
ఈ కేసు ఆధారంగా ఈడీ మనీలాండరింగ్ దర్యాప్తు చేస్తోంది. రాష్ట్రంలోని తొమ్మిది ప్రైవేట్ మెడికల్ కాలేజీలు, కార్యాలయాల్లో ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. 20 ప్రత్యేక బృందాలతో సోదాలు నిర్వహిస్తున్నారు. మేడ్చల్, మహబూబ్ నగర్, కరీంనగర్, నల్గొండ, హైదరాబాద్, రంగారెడ్డిలలో రెండు రోజులుగా ఈడీ సోదాలు చేపట్టింది. ఓవైసీ హాస్పటల్లో సైతం సోదాలు జరుగుతున్నాయి.