బెన్ స్టోక్స్ మాస్టర్ ప్లాన్.. క్రికెట్ లో ఇలాంటి ఫీల్డింగ్ సెటప్‌ని ఎప్పుడూ చూసుండరు!
- ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య హోరాహోరీగా యాషెస్ తొలి టెస్టు
- ఉస్మాన్ ఖవాజా వికెట్ కోసం అద్భుతమైన ఫీల్డింగ్ సెట్ చేసిన ఇంగ్లండ్ కెప్టెన్
- బంతిని ఎటు ఆడాలో తెలియక బౌల్డ్ అయిన ఖవాజా
.సాధారణంగా పేసర్లు బౌలింగ్ చేస్తుండగా.. ఎడ్జ్ లు వస్తాయని వికెట్ల వెనుక ఎక్కువ స్లిప్ ఫీల్డింగ్ పెడుతుంటారు. బ్యాటర్లు సాధారణంగా నాన్ స్ట్రయికర్ వైపు ‘వీ’ షేప్ (లాంగాన్, లాంగాఫ్) లేదా సెమీ సర్కిల్ మీదుగా బాల్ ను తరలించే ప్రయత్నం చేస్తుంటారు. అయితే, ఈ పోరులో స్టోక్స్ .. రివర్స్ వీ షేప్ లో ఫీల్డింగ్ సెట్ చేశాడు. స్లిప్ లో ఒక్కరిని కూడా ఉంచకుండా.. నాన్ స్ట్రయికర్ ఎడమ, కుడి వైపున ముగ్గురేసి చొప్పున ఆరుగురు ఫీల్డర్లను ఉంచాడు. బౌలర్ యార్కర్ వేయగా.. థర్డ్ మ్యాన్ దిశగా బంతిని ఆడే ప్రయత్నంలో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దాంతో, బెన్ స్టోక్స్ అద్భుతమైన ఫీల్డింగ్ సెట్ చేశాడంటూ అతనిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి..