తిరుపతిలో భారీ అగ్నిప్రమాదం.. గోవిందరాజు స్వామి ఆలయ రథానికి తగులుతున్న సెగలు
- తిరుపతి రైల్వే స్టేషన్ సమీపంలో భారీ అగ్నిప్రమాదం
- ఫొటో ఫ్రేమ్స్ షాపులో చెలరేగిన మంటలు
- మాడ వీధుల్లో రాకపోకల నిలిపివేత
అగ్నిప్రమాదం నేపథ్యంలో మాడ వీధుల్లో రాకపోకలను నిలిపివేశారు. మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు అగ్నిమాపక సిబ్బంది శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారు. మంటలు ఇంకా అదుపులోకి రాలేదు. అగ్నిప్రమాదం నేపథ్యంలో భక్తులు భయాందోళనలకు గురవుతున్నారు.