Avika Gor: నిర్మాతగానూ మారిన అవికా గోర్ ఏమైపోయినట్టు?

Avika Gor Special
షార్ట్స్‌లో చూడండి
బుల్లితెర ద్వారా ఒక బాలనటి అనేక భాషల్లో అభిమానులను సంపాదించుకోవడం అవికా గోర్ విషయంలోనే జరిగి ఉంటుందేమో. ఆ సీరియల్ అలా కొనసాగుతూ ఉండగానే అవికా టీనేజ్ లోకి వచ్చేసింది. ఆ సమయంలోనే 'ఉయ్యాలా జంపాలా' సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. 

ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో ఆమెను వెతుక్కుంటూ వరుస ఆఫర్లు వచ్చాయి. ఇక ఆ తరువాత ఆమె చేసిన సినిమాల్లో 'సినిమా చూపిస్త మావా' కూడా పెద్ద హిట్ కొట్టింది. కెరియర్ జోరుమీద ఉండగానే, కొంత గ్యాప్ తీసుకుంది. ఆ తరువాత 'ఎక్కడికిపోతావు చిన్నవాడా'లోను కనిపించింది. 

ఆ మధ్య 'పాప్ కార్న్' సినిమాతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకి ఆమె కూడా ఒక నిర్మాణ  భాగస్వామిగా వ్యవహరించింది. అయితే ఈ సినిమా ఫలితం నిరాశ పరిచింది. ఆ తరువాత నుంచి ఎక్కడా అవికా పేరు కనిపించడం లేదు .. వినిపించడం లేదు. పోనీ మిగతా భాషల్లో బిజీగా ఉందా అంటే అలాంటి దాఖలాలు కూడా ఏమీ కనిపించడం లేదు. 
Go Back to Shorts
Avika Gor
Actress
Tollywood

More Telugu News