బీఆర్ఎస్ ఎమ్మెల్యే నివాసం, కార్యాలయాల్లో ఐటీ దాడులు.. సోదాలు నిర్వహిస్తున్న 30 బృందాలు
- భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి నివాసం, కార్యాలయాల్లో ఐటీ దాడులు
- ఉదయం నుంచి 12 చోట్ల తనిఖీలు చేస్తున్న ఐటీ అధికారులు
- ఐటీ దాడులతో బీఆర్ఎస్ శ్రేణుల్లో టెన్షన్
దాదాపు 30 బృందాలు ఐటీ సోదాలను నిర్వహిస్తున్నాయి. కంపెనీల లావాదేవీలు, ఆదాయపన్ను చెల్లింపుల వివరాలను వీరు పరిశీలిస్తున్నట్టు సమాచారం. కేంద్ర బలగాల భద్రత మధ్య సోదాలు జరుగుతున్నాయి. ఈ ఐటీ దాడులతో బీఆర్ఎస్ పార్టీలో ఉత్కంఠ నెలకొంది.