నీహారికాకు అభిమానుల నుంచి ప్రశ్నలు
- వరుణ్ తేజ్ ఎంగేజ్ మెంట్ లో కనిపించని నీహారిక భర్త
- చైతన్య రాకపోవడంతో అతడు ఏడి? అంటూ అభిమానుల కామెంట్
- వారిద్దరి మధ్య విభేదాలపై ఇటీవల వార్తలు
అన్నయ్య, కాబోయే వదినతో కలసి దిగిన ఫొటోలను ఇన్ స్టాలో లావణ్య పంచుకోవడమే అభిమానుల ప్రశ్నలకు అవకాశం కల్పించినట్టయింది. ఆ ఫొటోలో నీహారిక భర్త జొన్నలగడ్డ చైతన్య లేకపోవడంతో అభిమానుల్లో సందేహాలు పెద్దవి అయ్యాయి. ‘బావ రాలేదా..???’ అంటూ ఓ యూజర్ ప్రశ్నించాడు. చై ఎక్కడ నీహారిక కొణిదెల? అంటూ మరో యూజర్ కామెంట్ సెక్షన్ లో ప్రశ్న సంధించాడు. నీ భర్త ఎక్కడ నీహా.. వరుణ్ బావ ఎక్కడ.. ఇలా ఎవరికి తోచిన విధంగా వారు కామెంట్ చేస్తున్నారు.
నీహారిక, ఆమె భర్త చైతన్య మధ్య విభేదాలపై ఇటీవల వార్తలు రావడం తెలిసిందే. ఇన్ స్టా గ్రామ్ లో చైతన్య, నీహారిక ఒకరికొకరు అన్ ఫాలో చేసుకోవడం వారి వైవాహిక బంధంపై సందేహాలను పెద్దవి చేసింది. నీహారిక తన ఇన్ స్టా నుంచి భర్త ఫొటోలను కూడా తొలగించినట్టు వార్తలు వచ్చాయి. నీహారికాను అన్ ఫాలో చేసిన చైతన్య, తాను సైతం ఆమె ఫొటోలను తొలగించినట్టు తెలుస్తోంది.