'ఆదిపురుష్' నుంచి 'శివోహం' సాంగ్ రిలీజ్!
- 'ఆది పురుష్'గా ప్రభాస్
- ఈ నెల 16వ తేదీన సినిమా విడుదల
- సంగీతాన్ని అందించిన అజయ్ - అతుల్
- ఆకట్టుకుంటున్న 'శివోహం' సాంగ్
శ్రీరాముడిగా ప్రభాస్ .. సీతాదేవిగా కృతి సనన్ నటించిన ఈ సినిమాలో, లక్ష్మణుడిగా సన్నీ సింగ్ .. హనుమంతుడుగా దేవ్ దత్ నటించారు. ఇటీవలే తెలుగు వెర్షన్ కి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంటును గ్రాండ్ గా నిర్వహించారు. అప్పటి నుంచి అంచనాలు పెంచుతూ వెళుతూ ఉన్న ఈ సినిమా నుంచి, కొంతసేపటి క్రితం 'శివోహం' అనే పాటను రిలీజ్ చేశారు.
'మహా ఫాల నేత్ర .. ' అంటూ ఈ పాట సాగుతోంది. కథాపరంగా శివుడిని పూజిస్తూ రావణాసురుడు ఆలపించే పాట ఇది. తెలుగులో రామజోగయ్య శాస్త్రి సాహిత్యాన్ని అందించగా .. హరిచరణ్ ఆలపించాడు. అజయ్ - అతుల్ స్వరపరిచిన ఈ పాట వెంటనే కనెక్ట్ అవుతుంది. ఈ నెల 16వ తేదీన ఈ సినిమాను ఐదు భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.